Kalvakuntla Taraka Rama Rao - KTR

Kalvakuntla Taraka Rama Rao - KTR

Share

Official Page of KTR, Former Minister & Working President - BRS Party, MLA from Sircilla, Telangana.

18/09/2026

రేవంత్..

నువ్వు చేసిన ఆరోపణల్లో ఒక్కటంటే ఒక్కశాతం నిజం లేకపోయినా.. నీకు ఓ ఆఫర్ ఇస్తున్నా..

మా కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ పనిగట్టుకుని చేస్తున్న విషప్రచారంపై.. నీకు ఓ సవాల్ విసురుతున్నా..

మాకున్న ఆస్తులన్నీ రాసిస్తాం… రాష్ట్రంలోని పేద ప్రజల ఖాతాలో రూ.లక్ష కోట్లు వేస్తావా..??

తెలంగాణలోని పేద ప్రజల ఖాతాలో వెంటనే నువ్వు లక్ష కోట్లు వేస్తానంటే.. మా పేరుతో ఉన్న ప్రతి ఇంచు భూమిని రాసిస్తాం..

లేకపోతే… నీ పిచ్చి ప్రచారాన్ని ఇకనైనా మానుకుని వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు.

వెయ్యి ఎకరాల ఫామ్ హౌజ్ అంటూ నువ్వు ఇంతకాలం చేసిన విషప్రచారం బెడిసి కొట్టడంతో.. కేసీఆర్ గారి కుటుంబానికి లక్షకోట్ల భూములు అంటూ ఈ విష ప్రచారం చేయడానికి సిగ్గనిపిస్తలేదా ??

కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది కేవలం 67 ఎకరాలు మాత్రమేనని నువ్వే అసెంబ్లీలో స్వయంగా ఒప్పుకున్నాక కూడా మళ్లీ కుతంత్రాలతో కట్టుకథలు అల్లుతావా ??

నీ వెయ్యిరోజుల పాలనా వైఫల్యాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకే ఈ కుట్ర చేస్తున్నట్టు తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది.

420 హామీల మోసాలనుంచి, 22 ఏ భూకుంభకోణం నుంచి ఈ చిల్లర ఆరోపణలతో నాలుగుకోట్ల ప్రజల దృష్టిని మళ్లించలేవు.

నువ్వు చేసిన ఆరోపణల్లో విషం తప్ప విషయం లేదు. అందులో అసత్యాల వరద, అబద్ధాల బురద తప్ప ఒక్కటంటే ఒక్క శాతం నిజం లేదని తెలిసినా ఎందుకీ కుప్పిగంతులు..??

గతంలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం పేరిట ఇలాగే దుష్ప్రచారం చేసి నేటికీ ఒక్క పైసా అవినీతిని నిరూపించలేకపోయావు.

ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబానికి లక్ష కోట్ల భూముల పేరిట మరో అబద్ధాల జపం చేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారని అనుకోవడం నీ అవివేకానికి నిదర్శనం.

తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి, నాలుగు కోట్ల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ గారి జీవితం ఓ తెరిచిన పుస్తకం.

ఓవైపు రైతులు కరెంట్ కోతలు, యూరియా సంక్షోభం, సాగునీటి తండ్లాటతో అల్లాడుతుంటే సోయిలేకుండా ప్రధాన ప్రతిపక్షంపై బురదజల్లుతావా ??

నిరుద్యోగులకు తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి వెయ్యి రోజులైనా పట్టుమని పదిశాతం భర్తీచేయని నీ చేతకానితనాన్ని ఇలాంటి విష ప్రచారంతో కప్పిపుచ్చలేవు.

పవిత్రమైన అసెంబ్లీని కూడా అసత్యాలు, అభూతకల్పనలతో చట్టసభ గౌరవానికి భంగం కలిగించి క్షమించరాని పాపాన్ని ఇప్పటికే మూటగట్టుకున్నావు.

22ఏ కింద కోటి 20 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాతో చేర్చడం వెనకే... నువ్వు చెబుతున్న లక్ష కోట్ల భూముల కుంభకోణం దాగి ఉంది.

అక్రమ దందాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలతో అడ్డదారిలో అందలం ఎక్కిన నీకు దోచుకోవడం, కుంభకోణాలు చేయడం తప్ప, పరిపాలన చేతకాదని సకల జనులకు అర్థమైపోయింది.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే మీ అవినీతి అక్రమాలు, కుంభకోణాలన్నంటినీ బయటపెడతాం.. మీరు దోచుకున్న ప్రతిపైసాను తెలంగాణ ప్రజల సాక్షిగా కక్కిస్తాం..

జై తెలంగాణ

18/09/2026

మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారిని సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో కలిశాను.
ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.

18/09/2026

Satyameva Jayate !!

BRS MLA Danam Nagendar who defected to Congress got disqualified by the Hon’ble High Court today

The rest of the defectors will also meet the same fate soon

18/09/2026

Rahul Gandhi , you carry a copy of the Constitution and preach sermons. You claim your politics is about ‘Mohabbat Ki Dukaan’. You talk about free speech. But your government in Telangana is acting in exactly the opposite manner.

Telangana police broke open the doors and barged into the home of our party leader Krishank, arrested him over a mere social media post criticising the government.

Krishank’s daughter was left crying inconsolably as police personnel created chaos.

Despite clear orders from the Hon’ble Supreme Court and High court against making arrests over social media posts, your Revanth government in Telangana is murdering democracy and flouting all democratic principles.

Is questioning the Congress government a sin?

Is criticising the ruling dispensation a crime?

Is this the way to arrest an opposition party leader by terrifying his family members?

Telangana is demanding answers, Mr. Rahul Gandhi

18/09/2026

LIVE: ఫార్ములా ఈ అక్రమ కేసులో నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

Photos from Kalvakuntla Taraka Rama Rao - KTR's post 18/09/2026

కక్షసాధింపు చర్యల్లో భాగంగా రేవంత్ సర్కార్ పెట్టిన ఫార్ములా-ఈ అక్రమ కేసు విచారణకు హాజరయ్యేందుకు నేడు నాంపల్లి కోర్టుకు…

ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు.. ప్రజాక్షేత్రంలో నిన్ను నిలదీస్తూనే ఉంటాం!

17/09/2026

కళ్లల్లో కళ్లుపెట్టి కాదు.. రేవం..తూ
నీ కాలర్ పట్టుకుని అడుగుతాం!

సస్పెన్షన్ ఎత్తేయ్..
దమ్ముంటే.. నెల రోజులు అసెంబ్లీ పెట్టు!

17/09/2026

కంపు నోటితో 1,000 ఎకరాలంటూ అబద్ధాలు కూసిన సన్నాసి రేవంత్..
నిన్న అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారికి ఉన్నది 67 ఎకరాలేనని ఒప్పుకున్నాడు.

చేసిన చిల్లర ఆరోపణలకు వెంటనే క్షమాపణ చెప్పు రేవంత్!

నీలాగా భూదందాలు చేయడం, వేరేవాళ్ల ఆస్తులు గుంజుకోవడం కేసీఆర్ గారి సంస్కృతి కాదు.

17/09/2026

LIVE: తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

17/09/2026

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ
జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు

Category

Address


Hyderabad