Sakilam Rajesh

Sakilam Rajesh

Share

sharing of knowledge KNOWLEDGE HUB

23/04/2024

"పుస్తకం ఓ అద్భుత ప్రపంచం"

పుస్తకము అన్ని అంశాల
హంగుల్ని నింపుకొని...
విజ్ఞాన కాంతుల్ని పులుముకొని...
అజ్ఞానమంటల్ని ఆర్పుతుంది!!...

అలరించే అంశాలతో...వివరించే చరిత్రలతో...
మానవీయ విలువలతో...
అంతులేని ఆసక్తిని కలిగిస్తుంది...

పుస్తకం నిండాపరుచుకున్న
రసాత్మకమైన పదాలకూర్పు...
అపురూపమైనది!!..అమూల్యమైనది!!...

అక్షరాలను దిద్దిస్తుంది...
పాఠాలను నేర్పిస్తుంది!...
సంఘర్షణల్ని దూరం చేస్తుంది..
నిత్యం పుస్తకంతో గడపండి...
మీలోని వ్యధలు..వెతలు దూరమవుతాయి!....

పుస్తకంలో అల్లుకుపోగలిగితే...
అది క్రమశిక్షణను నేర్పుతుంది..
పుస్తకము ఓ ఆత్మీయనేస్తం!...
పుస్తకము నిశ్శబ్ద జ్ఞానము!!...
ఓ మౌన ప్రదర్శనం!...

పుస్తకం ఆత్మచైతన్యం!...
ఓ మంచి మార్గదర్శకం!...
పుస్తకం ఓ జ్ఞాన దృష్టి!!..విజ్ఞాన పరిపుష్టి!!...

పుస్తకం మస్తిష్కానికి మందు!...
ప్రపంచ జ్ఞాన దీపిక!!...
కమనీయంగా రమణీయంగా...
అగుపించే జ్ఞాన సౌదామిని!...
ఆరాధకుల గుండెలో వెలిగేదీపం!!...

పుస్తకం ఓ కళాత్మకలోకం!...
వ్యక్తిత్వాన్ని నిలిపే విషయ పరిజ్ఞాని...
పుస్తకం గలగలా పారే జ్ఞాన సెలయేరు!..
పుస్తకం ఓ జనాత్మకత!...
మనసును వికసింపజేసే సృజనాత్మకత...
మానవ సమాజానికి... ఓ చక్కటి మార్గం...

జ్ఞాన సిరులు పండిస్తుంది...
విజ్ఞానతరులను నిలుపుతుంది...
మానవ జ్ఞాన సౌధానికి... పునాదివేస్తోంది!....
ఆత్మతో పిలుస్తుంది!...
అంతరాత్మతో పలుకరిస్తుంది!...

అనంత జ్ఞాన సాగరంలోకి నడిపిస్తుంది...
ఆచంచల భావాలను అందిస్తుంది!!...
అత్యున్నత ఆదర్శాలవైపు నడిపిస్తుంది!...
విజ్ఞాన వెలుగుల ద్వారాలను తెరిపిస్తుంది...
మనలోని సవాలక్ష కారణాలను దూరం చేస్తుంది!...

పుస్తకం ఓ అద్భుతప్రపంచం!!...
శాస్త్ర విజ్ఞాన సారాంశం!!...
పుస్తకమంటే చైతన్యం!...
పుస్తకమంటే ప్రగతికి మూలం!!...

"ప్రపంచ పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు"

సేకరణ: సకిలం రాజేష్....
లైబ్రేరియన్

13/04/2023
25/10/2021

దేవాలయంలో విగ్రహాలు ఏ భంగిమలో వుంటాయో కొంచెంగా తెలుసుకొందాం.................................... ........

మనం దేవాలయానికి వెళ్ళినపుడు గర్భగృహంలోవున్న ప్రధాన విగ్రహంతోపాటుగా స్తంభాలపైనా గుడికుడ్యాల (గోడల) పైనా అనేక విగ్రహాలను చూసేవుంటాం. ఒక్కో శిల్పం ఒక్కోలా వుంటుంది. కొన్నేమో నాట్యభంగిమలోను మరికొన్ని యుద్ధ, యోగాసన, వాయిద్య, సాధారణ భంగిమలలో వుంటాయి. మనకు ఈ ప్రధానవిగ్రహాలు కాని శిల్పాలుకాని సాధారణంగానే గోచరించవచ్చును. అయితే ప్రతిశిల్పం కూడా శాస్త్ర ప్రకారమే మలచిబడి వుంటుంది.

శిల్పశాస్త్రం నిర్దేశించిన ప్రకారమే ప్రతిశిల్పం వుంటుంది. దేవాలయంలోని మూలవిగ్రహాల భంగిమలు ఐదురకాలుగా వుంటాయి.
అవేమిటంటే (1) స్థానకం (2) ఆసనం (3) శయనం (4) స్థానకాసనం (5) శయనాసనం.
ఆసనమంటే పీఠం (కుర్చి, సంహాసనం) అనే అర్థాలు కూడా వున్నాయి.
గమనించారో లేదో ప్రతివిగ్రహం ఏదో ఒకపీఠం పైనే ఆసీనమైవుంటుంది.

(1) నిలుచున్న విగ్రహాన్ని స్థానకమంటారు.
(2) కూర్చోనివున్నభంగిమ విగ్రహాలను ఆసనమంటారు.
(3) పడుకొనివున్న భంగిమ విగ్రహాలను శయనమంటారు.
(4) నిలబడివున్న విగ్రహంలో తల ఎదురుగాకాకుండా ప్రక్కకు చూస్తున్న భంగిమలోనున్న విగ్రహాన్ని స్థానకాసనమంటారు.
(5) పడుకొని ప్రక్కకు చూస్తున్న విగ్రహభంగిమను శయనాసనమంటారు.

విశ్వకర్మీయ శిల్పశాస్త్రప్రకారం ఈ ఐదుభంగిమలను పంచవృత్తులని, పంచకృత్యమని పిలుస్తారు.

1. స్థానకమంటే విగ్రహం యొక్క చేతులు,రెండుపాదాలు సమంగాచాపివుంటాయి. చేతులలో ఆయుధాలు కలిగి రెండుపాదాలు సమతలంగావుంటే కూడా స్థానకభంగిమనే అంటారు. విష్ణు, చంద్రశేఖర విగ్రహాలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. రెండు పాదాలను వ్యతిరేకదిశలో వున్న విగ్రహాలను వైతస్థికస్థానభంగిమని, ఒకకాల పాదం సమంగావుండి మరోకాలిపాదం ప్రక్కకు తిరిగివుంటే అర్ధస్థికస్థానభంగిమంటారు.
చేతులను పూర్తిగా కిందికి చాపివుండి కాల్లు కూడా నిలువుగావుంటే అలాంటి విగ్రహాలను కాయోత్సర్గమంటారు. శ్రావణబెళగోళలోని గోమఠేశ్వర విగ్రహం ఇందుకు మంచి వుదాహరణగా చెప్పాలి.

(2) ఆసనవిషయానికి వస్తే ఎడమకాలు మడచి, కుడికాలును పీఠంనుండి కిందికి వదలిన విగ్రహాలను సుఖాసీనభంగిమలంటారు.
మరోకటి పద్మాసనం. పద్మాసనంలో రెండుఅరికాల్లు బయటకు కనబడేవిధంగా కాల్లురెండు ఒకదానిమీద ఒకటిగా వుండాలి.దీనినే కమలాసనమని కూడా అంటారు. అరికాల్లు కనబడకుండా కుర్చున్న భంగిమను అర్ధపద్మాసనమంటారు.
ఒకకాలును పద్మాసనంలోలాగా కాల్లను వుంచి, మరొకకాలును కాస్తా వంచి కూర్చున్న విగ్రహాన్ని మహరాజలీలాసనమంటారు. పీఠమునుండి ఒకకాలును కిందకు వదలి, మరోకాలి అరికాలు కిందకు వదలిన కాలిమోకాలిపై వుంచి కూర్చున్న విగ్రహాలను వీరాసనమంటారు.

ఇంకా ఈ ఆసనాలలో మహారాజలీలాసనం, ఉత్కిటికాసనం, రాజలింగాసనం, యోగాసనం, స్వస్తికాసనం, గరుడాసనం అనేరకాలున్నాయి.

ఇంకా వైశాఖస్థానకం, వైష్ణవం, స్వస్తికాసనం, ప్రత్యాలీఢాసనం, ఊర్ద్వజాను, ఏకపాదస్థానకం, సమశయనాసనం, అర్ధశయనాసనం మొ॥రకాలున్నాయి.

॥సేకరణ॥.............................................................................

Photos from Sakilam Rajesh's post 05/05/2021
29/05/2020

నవ గ్రహముల జననము 👍👌💐

1) సూర్యుడు : శ్రీ కశ్యప బుషికి దక్షుని పుత్రికయగు అదితికిని "వివస్వంతుడు (సూర్యుడు)" జన్మెంచెను(ప్రభవ నామ సంవత్సర మాఘ మాస శుద్ద సప్తమి)కశ్యపుని కొడుకు కనుక "కాశ్యపుడు" అని
అదితి కొడుకు కనుక "ఆదిత్యుడు" అని
అండమున మృతము లేనివాడు కనుక "మార్తాండుడు" అని నామములు వచ్చెనుసూర్యునకు సంజ్ఞాదేవికిని "వైవస్వతుడు" "యముడు" "యమున" లు జన్మించెను
సూర్యుని తీక్షతను భరించలేక సంజ్ఞాదేవి తన నీడను (ఛాయను) తనకు బదులుగా వెల్లి పుట్టింటికి వెల్లిపోయెను
తరువాత ఛాయకు "శని" భగవానుడు జన్మించెనుయముడు ధర్మరాజు అను నామముతో పితృలోకపాలకుడయ్యెను శని గ్రహ పదవిని పొందెను
వైవస్వతుడు రాబోవు మన్వంతరాలలో మనువు కాగలడు

2) చంద్రుడు : అత్రి మహర్షి అనసూయల సంతానం
అత్రి మహర్షి తపస్సు చేయుచుండగా అతని వీర్యము భూమిపై పడెను సోమరూపైన వీర్యమును బ్రహ్మ లోక హితార్థమై తన రథమెక్కించుకొని భూమి చుట్టు ఇరవైఒక్క మారలు ప్రదక్షిణలు గావించెను ఆయన తేజస్సుచే జగదాధారభూతములైన సర్వౌషదులు మొలకెత్తెను(నందన నామ సంవత్సర కార్తీక శుద్ద చతుర్థశి)సోముని బ్రహ్మ భూమికి రాజును చేసెను
చంద్రుని పుత్రుడు బుధుడు

3) కుజుడు : శివుని నిండి వెలువడిన తేజము పార్వతీ దేవి గ్రహించి గర్భవతి అవగా ఆమే అఆ తేజమును భరింపలేక భూదేవికి ఇచ్చెను ఆమే ఆ తేజమును ధరింపగా "కుజుడు"(అంగారకుడు) జన్మించెను(అక్షయ నామ సంవత్సరం వైశాఖ బహుళ విదియ)రుద్రుని తేజము విష్ణువు సంరక్షణ భూదేవి ఓర్పు లభించినవాడు కనుక గ్రహమండలమున స్థానమునొందెను

4) బుధుడు : సోమునకును రోహిని తారకు బుదుడు జన్మించెను(సౌమ్య నామ సంవత్సరం భాద్రపద శుద్ద ఏకాదశి)బుదునికి వైరజకిని పురూరవుడు జన్మించెను

5) బృహస్పతి : సురూప ఆంగీరసులకు "బృహస్పతి" జన్మించెను(సౌమ్య నామ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ద ద్వాదశి)ఇతని భార్య "తారాదేవి"
ఇతడిని దేవతలకు గురువుని చేసెను కనుక ఇతడిని
"గురుడు" అనెదరు

6) శుక్రుడు : భృగు ప్రజాపతికిని ఉషనలకు సంతానం
"ఉశనుడు" జన్మించెను(మన్మథ నామ సంవత్సరం శ్రావణ శుద్ద దశమి)కుచేలుని ధనమును హరించుటచే పరమేశ్వరుడు కోపించి అతడిని చంపుటకు రాగా ఉశనుడు తన యోగ శక్తితో శివుని ఉదరమున ప్రవేశించెను
పరమేశ్వరుడు అతడినొ శిశ్నము ద్వార బయటకు విడిచెను అతడు శుక్రము రూపమున విసర్జింపబడెను కనుక అతడిని "శుక్రుడు" అనెదరుఅత్యంత మహా మంత్ర శక్తిని పోందినవాడు కనుక రాక్షసులు శుక్రుడిని వారి గురువుగా పొందిరి
నాటి నుండి "శుక్రచార్యునిగా" పెరుపొందెను
గ్రహమండలమున స్థానంపొందెను

7) శని : సూర్యునికి ఛాయ దేవికిని కలిగిన సంతానమే "శని" ఇతని వృత్తాంతంము సూర్యుని వృత్తాంతమునందు చెప్పబడెను(వికారి నామ సంవత్సరం మార్గశిర కృష్ణ నవమి)ఇతడు మానవ జీవితాలలో అత్యంత ప్రభావము చూపువాడు
త్రిమూర్తుల సైతం ముప్పుతిప్పలు పెట్టినటువంటివాడు
గ్రహమండలమున స్థానం పొందెను

8) రాహువు : కశ్యప మహర్షికి సింహికకును "రాహువు" జన్మించెను
ఇతడు రాక్షల లక్షణములు కలవాడు కనుక రాక్షసునిగా పరిగణిస్తారు(రాక్షస నామ సంవత్సరం కృష్ణ చతుర్థశి)క్షీర సాగర మథనంలొ లబించిన అమృతాన్ని మహావిష్ణువు "మోహిని"అను రూపముతో పంచుతున్నపుడు రాహువు దేవతల రూపం దాల్చి అమృతమును గ్రహించెను సూర్యచంద్రులు చూసి విష్ణువుకి చెప్పగా తన చక్రముతో రాహువు తల ఖండించెను అమృత ప్రభావంతో తల మొండెము జీవముతో ఉండుటచేత పాము శరీరం అతకబడింది

9) కేతువు : విష్ణువుచే ఖండింపబడిన రాహువు శరీరముకు పాము తల తగిలించి కేతువు అని నామం పెట్టిరి
ఇతని భార్య పేరు చిత్రలేఖరాహు కేతువులు ఇరువురు గ్రహమండలమున ఛాయగ్రహములుగా గుర్తింపునొందిరి...

నవ గ్రహ దేవతల జన్మ వృత్తాంతములు చదివిన ఆపదలు తొలిగి మహా యశస్సు పొందెదరు
ఆయుష్యు ఆరోగ్యం సంకల్ప సాఫల్యము కలుగును
నవ గ్రహముల అనుగ్రహము కలిగి సర్వత్రా శుభమగును.
(అని బ్రహ్మ పురాణమందు చెప్పబడెను).

28/02/2020
23/07/2018

గి బోర్డ్ ఒక్క మన శ్రీనన్న హాస్పిటల్ లనే ఉంటది.
పైసలు కట్టెదాకా ట్రీట్మెంట్ చెయ్యమనే డాక్టర్ లున్న ఈరోజుల్లో బిల్లు విషయంలో బయపడకండి మీకు నేనున్నా అని ధైర్యామిచ్చే నాయకుడు సేవకుడు మన ప్రియతమ మార్గదర్శి ప్రజాభందువు మన అన్న శ్రీనివాసుడు..
రూపాయి ఖర్చులేకుండా ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపాడు.
అర్ధరాత్రైనా పోన్ కాల్ కి స్పందిస్తాడు
ప్రాణం కాపాడతాడు.

Category

Telephone

Website

Address


Hyderabad
509217

Alerts

Be the first to know and let us send you an email when Sakilam Rajesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Subscribe

We will notify you when anything happens in Hyderabad.