Chandra Rajeswara Rao Foundation for Social Progress

Chandra Rajeswara Rao Foundation for Social Progress

Share

Chandra Rajeswara Rao Foundation To translate into deeds of Chandra Rajeswara Rao ideals and aims, the CR Foundation decided to take up a number of projects.

The Government of Andhra Pradesh allotted 5 acres of prime land in a strategic location in Kondapur, Hyderabad near the famous IT hub of AP, where the Hitech City is located.

Photos from Chandra Rajeswara Rao Foundation for Social Progress's post 17/06/2026

తేదీ : 16- 06 - 2026

దోపిడీ, అసమానతల యొక్క పునాదిని ప్రశ్నించే ఉద్యమ నిర్మాతల్లో సుగుణ ఒకరు .

నిరంకుశ నిజాం సైన్యం, రజాకార్లుకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు శాఖమూరి సుగుణ ధైర్యం చాలా గొప్పదని, దోపిడీ, అసమానతల యొక్క పునాదిని ప్రశ్నించే ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖులు సుగుణమ్మ అని, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కీర్తిశేషులు ఎస్ వి కె ప్రసాద్ భార్య శ్రీమతి సుగుణ త్యాగాలను స్మరించు కున్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు, మహిళాసమాఖ్య, కమ్యూనిస్టు నాయకురాలు శాఖమూరి సుగుణ ప్రథమ వర్ధంతి సందర్భంగా శాఖమూరి సుగుణ చిత్రపటానికి ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
సుదీర్ఘ కాలం సి ఆర్ ఫౌండేషన్ వృద్ధాశ్రమం లో నివసిస్తూ గతసంవత్సరం ఇదే రోజు శ్రీమతి సుగుణమ్మ కన్నుమూశారు. శ్రీమతి సుగుణమ్మ మరియు వారి కుటుంబసభ్యులు సి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కార్యకలాపాలకు ఎంతగానో దోహదం చేశారని వారి సహకారాన్ని స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో సి ఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కె. అజయ్ కుమార్, కోశాధికారి చెన్నకేశవరావు, ఆరోగ్య కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె రజిని, శ్రీమతి సుగుణమ్మ కుటుంబసభ్యుల తరఫున ఏ. కె. జిలానీ,
వృద్ధాశ్రమ సలహా కమిటీ సభ్యులు తమ్మారెడ్డి తాన్య, యన్. రాజేంద్ర రావు, మల్లంపాటి వెంకటేశ్వర రావు, సాంబశివ రావు, అరుణకుమారి, మహిళాసంక్షేమ కేంద్రం సభ్యులు వి లలిత, వృద్ధాశ్రమ వాసులు, విద్యార్దినిలు, తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

Photos from Chandra Rajeswara Rao Foundation for Social Progress's post 17/06/2026

చంద్ర రాజేశ్వరరావు ఫౌండేషన్
హైదరాబాద్
--------//////-------------

తేదీ .13-06-2026

శ్రీకృష్ణ లీలలు నాటక ప్రదర్శన :

సురభి డ్రామా థియేటర్ వారి ఆధ్వర్యంలో
చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్ సి ఆర్ ఫౌండేషన్ కొండాపూర్ హైదరాబాద్, ఇంద్రజిత్ గుప్తా హాలు లో శనివారం13 జూన్ నాటక ప్రదర్శన జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ కే నారాయణ గారు ప్రదర్శనను చూసి కళాకారులను అభినందించారు.
అనంతరం నారాయణ గారు మాట్లాడుతూ
140 సంవత్సరాల ఘన నాటక రంగ చరిత్ర కలిగిన “సురభి” కళామతల్లిని ప్రోత్సహించాలి – హీన సంస్కృతిని కాదు

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవాన్ని తరతరాలకు అందిస్తూ 140 సంవత్సరాలుగా ప్రజలను అలరిస్తున్న “సురభి” నాటకరంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందించాలి. సురభి వంటి కళాసంస్థలు మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు మాత్రమే కాకుండా సమాజానికి విలువలు, చైతన్యం, సృజనాత్మకతను అందించే కళా నిలయాలు.

నేడు వినోదం పేరుతో హీన సంస్కృతిని ప్రోత్సహించే కార్యక్రమాలకు లభిస్తున్న ప్రాధాన్యత కంటే, కళా విలువలను పరిరక్షిస్తూ ప్రజల్లో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించే సురభి వంటి నాటక సమాజాలకు ప్రభుత్వాలు మరింత ప్రాధాన్యత ఇవ్వాలి.

విలాసవంతమైన, భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించడం కాకుండా, ఆర్థిక ఇబ్బందులతో కొనసాగుతున్న సంప్రదాయ నాటకరంగం, జానపద కళలు, రంగస్థల కళాకారులను ఆదుకునే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలి.

నిజమైన కళను, సంస్కృతిని పరిరక్షించడం సమాజం మరియు ప్రభుత్వాల బాధ్యత. తెలుగు కళా వైభవానికి ప్రతీకగా నిలిచిన “సురభి” నాటకరంగాన్ని రక్షించి, ప్రోత్సహించడం ద్వారా భావితరాలకు మన సాంస్కృతిక సంపదను అందించగలుగుతాము.

ఈ నాటక ప్రదర్శన కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ , సి ఆర్ పాలిక్ క్లినిక్ డైరెక్టర్ కె రజిని, ఏఐటీయూసీ సీనియర్ నాయకురాలు ప్రేమ పావని, కనపర్తి జోత్స్న, వృద్ధాశ్రమ సలహా కమిటీ సభ్యులు ఎన్ రాజేంద్ర రావు, మల్లంపాటి వెంకటేశ్వరరావు ,ఐదు కళ్ళు అరుణకుమారి, తమ్మారెడ్డి తానియా,వృద్ధాశ్రమ వాసులు, హోం మేనేజర్ శ్రీనివాస్, సురభి డ్రామా థియేటర్ అధ్యక్షులు వాసుదేవరావు, ప్రజానాట్యమండలి కళాకారులు కూన సుధాకర్, డప్పు రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.
నాటక ప్రదర్శన చేసిన కళాకారులను వృద్ధాశ్రమ వాసులు అభినందించారు.

– కె. నారాయణ
గౌరవాధ్యక్షులు, సీఆర్ ఫౌండేషన్
కొండాపూర్, హైదరాబాద్

12/06/2026

Free mega medical camp :

Photos from Chandra Rajeswara Rao Foundation for Social Progress's post 10/06/2026
Photos from Chandra Rajeswara Rao Foundation for Social Progress's post 08/06/2026

తేదీ : 08.06.2026

చండ్ర రాజేశ్వరరావు ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకం
ప్రజాస్వామ్య పరిరక్షణకు యువత, వామపక్ష శక్తులు ఐక్యంగా ముందుకు రావాలి:
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్‌రెడ్డి

దేశంలో పెరుగుతున్న అసంతృప్తి, రాజకీయ వ్యవస్థపై ప్రజల్లో నెలకొంటున్న నిరాశను అధిగమించాలంటే కమ్యూనిస్టు, సెక్యులర్‌, సోషలిస్టు శక్తులు ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్‌ కె.శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. కమ్యూనిస్టు ఉద్యమ స్ఫూర్తిని నేటి తరానికి చేరవేయడంతో పాటు యువతను ఆకర్షించే పద్ధతుల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని సూచించారు. అప్పుడే కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజం చండ్ర రాజేశ్వరరావు బాటలో పయణించినా వారమవుతామని పేర్కొన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ దిగ్గజం చండ్ర రాజేశ్వరరావు 112 వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని సి.ఆర్‌. ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో "బొద్దింకల అవిర్భావం - యువత - నెటిజెన్స్ ఎటువైపు" అనే అంశంపై సదస్సు నిర్వహించారు. సిఆర్‌ పౌండేషన్‌ గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ కె.నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదిగా కె.శ్రీనివాసరెడ్డి,
సీఆర్ ఫౌండేషన్‌ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శి పి.జె.చంద్రశేఖరరావు, కోశాధికారి వి. చెన్నకేశవరావు, సిఆర్‌ ఫౌండేషన్‌ డెయాగ్నస్టిక్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రంజని, మహిళా సంక్షేమ కేంద్రం డైరెక్టర్‌ కల్పనలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భారత వామపక్ష రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు చండ్ర రాజేశ్వరరావు వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితం, ప్రజాసేవలో ఆదర్శప్రాయుడని తెలంగాణ కొనియాడారు. సిఆర్‌ కేవలం కమ్యూనిస్టు నాయకుడే కాకుండా రాజకీయ నైతికతకు, నిరాడంబర జీవనానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. దేశ రాజకీయ చరిత్రలో కీలక పాత్ర పోషించిన నాయకుడి అనుభవాలు సంపూర్ణంగా పుస్తకరూపంలో అందుబాటులోకి రాకపోవడం ఒక లోటుగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

డాక్టర్‌ నారాయణ మాట్లాడుతూ దేశ సమైక్యతకు ఎనలేని కృషి చేసిన మహానేత చండ్ర రాజేశ్వరరావు అని కొనియడారు.దేశంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం తాత్కాలికం కాదని, యువతలో పెరుగుతున్న అసంతృప్తి, రాజ్యాంగబద్ధ సంస్థలపై నమ్మకం క్షీణించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలని హెచ్చరించారు. శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌ వంటి దేశాల్లో కూడా ఇదే తరహా ప్రజా అసంతృప్తి కనిపించిందని వివరించారు.యువతలో పేరుకుపోతున్న అసంతృపిని ప్రభుత్వం అర్థం చేసుకుని పరిష్కరించకపోతే అది దేశ రాజకీయ, సామాజిక పరిస్థితులను గణనీయంగా ప్రభావితం చేయగలదన్నారు.

ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ చండ్ర రాజేశ్వరరావు జీవితం ఉద్యమ కార్యకర్తలకు ఆదర్శమని, ఆయన చూపిన మార్గంలో నడవడమే నిజమైన నివాళి అని అన్నారు. సిఆర్‌ తన 80 ఏళ్ల జీవితాన్ని ప్రజా ఉద్యమాలకు అంకితం చేశారని గుర్తుచేశారు. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ త్యాగాలు తనపై ప్రభావం చూపాయని సిఆర్‌ చెప్పేవారని తెలిపారు. ప్రజాతంత్ర, వామపక్ష శక్తుల ఐక్యత ద్వారానే సామాజిక మార్పు సాధ్యమని ఆయన విశ్వసించారని పేర్కొన్నారు.

ఈసందర్భంగా గత23 ఏళ్లుగా సిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న వృద్ధాశ్రమం లో నివాసం ఉంటున్న ప్రొఫెసర్‌ వేణు గోపాల్‌, డాక్టర్‌ రంగనాయకి 70వ వివాహా వార్షికోత్సం సందర్భంగా ఘనంగా సన్మానించారు.

యువతలోని అసహానం- అసంతృప్తిని కమ్యూనిస్టులు అందిపుచ్చుకోవాలి
చండ్ర రాజేశ్వరరావు జయంతి సందర్భంగా బొద్దింకల అవిర్భావం- యువత- నెటిజన్స్‌ ఎటువైపు అనే అంశంపై శ్రీనివాస్‌రెడ్డి కీలకోపాన్యాసం చేశారు. ఓ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోచనతో లేక అనాలోచనాతోనో బొద్దింకలు అనే పదాన్ని ఉపయోగించిన నేపథ్యంలో దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడమేకాకుండా సోషల్‌ మీడియా వేదికగా కక్రోచ్‌ జనతా పార్టీ ఏర్పాటు చేయడం, ఆ వెంటనే 2.20 కోట్ల మంది సభ్యులు దానికి మద్దతు పలకడం దేశ యువతలో నెలకొన్న అసంతృప్తికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 6వ తేదీన కాక్రోచ్‌ జనత పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నీట్‌ పరీక్ష ప్రశ్నా పత్రం లీకేజి, సిబిఎస్‌ఈ ఘటలపై యువత పెద్ద ఎత్తున నిరసన తెలిపిన విషయం తెలిసిందేన్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం ముందు వారు ప్రధానంగా 5 డిమాండ్లపై ప్రభుత్వ ముందు పెట్టారన్నారు. అందులో ఒక పార్టీ గుర్తుపై ఎన్నికై తర్వాత మరో పార్టీలో చేరే ప్రజాప్రతినిధులను 20 ఏళ్ల పాటు పోటీకి అనర్హులు ప్రకటించాలనిఆదేవిధంగాఈ దేశంలోని 18 ఏళ్ల నిండిన ప్రతి పౌరుడికి ఓటు కల్పించాలని దానిని ఎన్నికల కమిషన్‌ తొలగిస్తే కమిషనర్లపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసేలా ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు ఓటర్ల జాబితాల నిర్వహణలో పారదర్శకత పెంచాలని సూచించారన్నారు.మీడియా సంస్థలు ప్రజాస్వామ్య విలువలను కాపాడే బాధ్యతను మరవకూడదని, ప్రజల సమస్యలను ప్రతిబింబించే స్వతంత్ర మీడియాకు మాత్రమే అనుమతించాలని కార్పొరేట్‌ మీడియా సంస్థలను నిషేదించాలని డిమాండ్‌ చేశారన్నారు.ఈ నేపథ్యంలో దేశంలో పెరుగుతున్న సామాజిక, ఆర్థిక అసమానతల నేపథ్యంలో కమ్యూనిస్టు, సెక్యులర్‌, సోషలిస్టు శక్తుల మనుగడ అత్యంత కీలకమన్నారు.యువతను ఆకర్షించడంలో కమ్యూనిస్టు పార్టీలు కొత్త వ్యూహాలను అవలంబించాల్సిన అవసరం ఉందని, 50 ఏళ్ల క్రితం పనిచేసిన పద్ధతులు నేటి తరానికి సరిపోవని, వారి భాషలోనే మాట్లాడుతూ ఆధునిక మాధ్యమాలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగితేనే దేశ భవిష్యత్తుకు భరోసా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సన్మానిత వృద్ధాశ్రమ దంపతులు ప్రొఫెసర్ వేణుగోపాల్- డాక్టర్ రంగనాయకి దంపతులు సీ ఆర్ ఫౌండేషన్ కు లక్ష రూపాయలు విరాళం అందజేశారు. వారు ప్రసంగిస్తూ సి ఆర్ ఫౌండేషన్ ఆశ్రమంలో ఉన్నందువల్లనే తాము ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటున్నామని కృతజ్ఞతలు తెలియజేశారు.

కామ్రేడ్ CR జయంతి సందర్భంగా బొద్దింకల ఆవిర్భావం - యువత నెటిజెన్స్ ఎటువైపు అనే అంశంపై సదస్సు 08/06/2026

https://www.youtube.com/live/tiY3uBC0D9I?si=iIhr70ItJWpfg992 కామ్రేడ్ కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు జయంతి సందర్భంగా సిఆర్ ఫౌండేషన్ లో *బొద్దింకల ఆవిర్భావం - యువత నేటిజన్స్ ఎటువైపు అనే అంశంపై తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి గారి ప్రసంగం*

కామ్రేడ్ CR జయంతి సందర్భంగా బొద్దింకల ఆవిర్భావం - యువత నెటిజెన్స్ ఎటువైపు అనే అంశంపై సదస్సు SONGS:https://youtube.com/playlist?list=PL...

Photos from Chandra Rajeswara Rao Foundation for Social Progress's post 06/06/2026

06.06.2026.

చండ్ర రాజేశ్వర రావు గారి 112వ జయంతి సందర్భంగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ కొండాపూర్‌లోని సిఆర్ ఫౌండేషన్‌లో చండ్ర రాజేశ్వరరావు (సిఆర్) విగ్రహానికి చండ్ర రాజేశ్వర రావు ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు డాక్టర్ కె. నారాయణ, సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్ శ్రీమతి సృజన, IAS పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ నారాయణ ప్రసంగిస్తూ -
కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో, భారత జాతీయ స్వాతంత్ర ఉద్యమంలోనూ, తెలంగాణ సాయిధ పోరాటం లోను, భూస్వామ్య వ్యవస్థ నిర్మూలించడంలో చండ్ర రాజేశ్వర్ రావు నిర్వహించిన పాత్ర ప్రముఖమైనదని, రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకికవాద రక్షణకు మరియు దేశ సమైక్యతకు కృషిచేసిన గొప్ప మానవతావాది చండ్ర రాజేశ్వరరావు అని తెలిపారు.

మూడు దశాబ్దాల పైగా ప్రారంభించబడిన సి ఆర్ ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు-
హైదరాబాదులో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ దేశంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు సంపాదించి 150 మంది సీనియర్ సిటిజనులకు ఆశ్రమం కల్పించామని;
సి ఆర్ ఫౌండేషన్ తరపున ఒక మహిళ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మరియు సిఆర్ పాలి క్లినిక్ , ఎన్ ఆర్ ఆర్ రీసెర్చ్ సెంటర్, విశాలమైన గ్రంథాలయం, కార్యకలాపాలు విజయవంతంగా నడుస్తున్నట్లు పేర్కొన్నారు.
అలాగే గుంటూరులో నాలుగు ఎకరాల్లో, గూడూరు లో ఒక ఎకరం విస్తీర్ణంలో సి ఆర్ ఫౌండేషన్ పేరుతో ఓల్డ్ ఏజ్ హోమ్, ఆర్ఫన్స్ చిల్డ్రన్ హోం లు నిర్మించబోతున్నట్లు తెలిపారు.
కడపలో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన హోమ్ నీ వచ్చే నెల నుంచి ప్రారంభించడం జరుగుతోందని తెలిపారు.

సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్ శ్రీమతి సృజన, IAS
మాట్లాడుతూ చండ్ర రాజేశ్వర్ రావు గారు దేశం మొత్తం గర్వపడే విధంగా కృషి చేశారని, ఆయన ప్రజల కొరకు ఎన్నో త్యాగాలను చేశారని, ఆయన పేరిట వున్న చండ్ర రాజేశ్వర రావు ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్ చేస్తున్న సామాజిక సేవలను ప్రశంసించారు. సి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న సామాజి సేవా సంస్థలన్నింటినీ ఆమె సందర్శించారు.
ఈ కార్యక్రమంలో సి ఆర్ ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కె. అజయ్ కుమార్, కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వరరావు, కోశాధికారి చెన్నకేశవరావు, ఆరోగ్య కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె రజిని,
మహిళా సంక్షేమ కేంద్రం డైరెక్టర్ జోశ్యభట్ల కల్పన , వృద్ధాశ్రమ సలహా కమిటీ సభ్యులు తమ్మారెడ్డి తాన్య, యన్. రాజేంద్ర రావు, మల్లంపాటి వెంకటేశ్వర రావు, సాంబశివ రావు, అరుణకుమారి మహిళాసంక్షేమ కేంద్రం సభ్యులు వి లలిత, ఆరుట్ల మమత, డి. కృష్ణకుమారి, వంక లక్ష్మి, పాలిక్లినిక్ సి ఓ ఓ శ్రీమతి విజయ, సీఈఓ డి. శ్రీనివాస్, సి పి ఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు రామకృష్ణ, శేరిలింగంపల్లి కార్యదర్శి చందు యాదవ్, ఎన్ ఆర్ ఆర్ సెంటర్ సభ్యులు డి. జవహర్ బాబు
వృద్ధాశ్రమ వాసులు, విద్యార్దినిలు, తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

Photos from Chandra Rajeswara Rao Foundation for Social Progress's post 06/06/2026

05.06.2026.

*మహిళా రిజర్వేషన్ బిల్లును* *షరతులు లేకుండా అమోదించాలి**
**Dr K. రజని**
**ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జాతీయ కార్యదర్శి**
, . భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) 72 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా కొండాపూర్ CR ఫౌండేషన్ లో శుక్రవారం ఎన్ఎఫ్ఐడబ్ల్యూ పతాకాన్నిమహిళా సమాఖ్య సీనియర్ నాయకురాలు జోశ్యభట్ల కల్పన గారు ఎగురువేశారు. ఈ కార్యక్రమం నికి ముఖ్య అతిధిగా హాజరైన Dr K. రజని గారు మాట్లాడుతూ సామాజిక-ఆర్థిక అసమానతలు మరియు లింగవివక్షత కు వ్యతిరేకంగా హింసను పరిష్కరించడానికి మహిళలను సంఘటితం చేస్తూ 72 సంవత్సరాలనుండి ఎన్ఎఫ్ఐడబ్ల్యూ అలుపెరుగనిపోరాటం చేస్తుందని తెలిపారు. పార్లమెంట్ లో మహిళలకు 33% రేజర్వేషన్ల బిల్లు ను తీసుకవచ్చి ఆమోదించాలని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నాయకురాలు అప్పటి పార్లమెంట్ సభ్యురాలు గీత ముఖర్జీ డిమాండ్ చేసిందని గుర్తు చేసారు. నేటి బీజేపీ నిరంకుశ కేంద్ర పాలకులు మహిళలకు 33% రేజర్వేషన్ల బిల్లు ను పార్లమెంట్ లో ఆమోదించి, అమలు చేయకుండా బుట్టదాఖలు చేసారని మండిపడ్డారు. చట్టసభల్లో మహిళలకు 33% రేజర్వేషన్ల కల్పించేదాకా దేశవ్యాప్తంగా ఉద్యమించాలని Dr k రజని పిలుపునిచ్చారు. మహిళలకు తగినంత చట్టపరమైన రక్షణ లేకపోవడం మరియు నిరంతర సామాజిక అసమానతలు వంటి స్వాతంత్ర్యానంతర సవాళ్లను ఎదురుకోవడానికి 1954 లో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) స్థాపించబడిందని తెలిపారు. పెట్టుబడిదారీ విధానాలకు, మతపరమైన విభజనలకు, పెరుగుతున్న ధరలు, ఆహార కొరత మరియు ఉచిత విద్య ఆరోగ్యం . మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొరకు Nfiw నిరంతరం పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో Nfiw ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి,సీనియర్ నాయకురాలు K. జ్యోత్స్న, వి. లలిత . మృణలిని,
T. టాన్య, సి ఆర్ ఫౌండేషన్ ట్రెజరర్ వి. చెన్నకేశవ రావు, ఉపాధ్యక్షులు కె. అజయ్, పాలిక్లినిక్ సి ఓ ఓ కె. విజయ సంక్షేమ కేంద్రం టీచర్స్ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

Photos from Chandra Rajeswara Rao Foundation for Social Progress's post 05/06/2026

Nano generanion couple felicitated on the occasion of their 70th wedding anniversary.

గత 23 సంవత్సరాలుగా సి ఆర్ ఫౌండేషన్ హోం ఫర్ ఏజ్డ్ (వృద్ధాశ్రమం) లో నివాసం ఉంటున్న ప్రొఫెసర్ వేణుగోపాల్ - డాక్టర్ రంగనాయకి దంపతుల 70వ వివాహ వార్షికోత్సవo మరియు డాక్టర్ రంగనాయకి గారి 90వ జన్మదినోత్సవ సందర్భంగా వారిని అభినందించడం జరిగింది.

Want your organization to be the top-listed Non Profit Organization in Hyderabad?
Click here to claim your Sponsored Listing.

Telephone

Address


CR Foundation, CR Marg, Kondapur
Hyderabad
500084