Anumula Revanth Reddy

Anumula Revanth Reddy

Share

Chief Minister of Telangana

24/09/2026

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల గారి కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యాను. కాబోయే వధూవరులు అంజిలి–రఘు లను ఆశీర్వదించాను.

Photos from Anumula Revanth Reddy's post 23/09/2026

ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించాను.

యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి సామర్థ్యంతో పనిచేయకపోవడంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నాం. జీ-9 బొగ్గు లభ్యత, బొగ్గు సరఫరా వల్ల రాష్ట్రంపై పడుతున్న అదనపు భారం, సింగరేణి బొగ్గు బ్లాకుల పరిస్థితిపై చర్చించాం.

రాష్ట్ర విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మహానది కోల్‌ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలుకు చర్యలు ప్రారంభించాలని ఆదేశించాను. కేంద్ర బొగ్గు గనుల శాఖతో తక్షణమే చర్చించాలని సూచించాను.

దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను.

23/09/2026

Telangana’s zero-tolerance policy against substance abuse is now a benchmark for the entire nation.

Our Anti-Narcotics Bureau and have earned top national honors at the Conference of ANTF Heads in New Delhi, setting the gold standard among state anti-narcotics task forces by scoring over 80% across Union Government metrics. This national milestone directly validates our administration’s strategy combining intelligence-led enforcement, seamless inter-agency coordination, and proactive prevention to dismantle drug networks.

My heartiest congratulations to EAGLE Force Director Shri Sandeep Shandilya Garu and our entire police force for their fierce dedication. We will continue to lead by example, protecting our youth and building a resilient state.

Photos from Anumula Revanth Reddy's post 23/09/2026

సచివాలయంలో ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, ఢిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించాను.

ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, శిల్పకళకు ప్రతీకలుగా ఉండేలా డిజైన్లు రూపొందించాలని సూచించాను.

విమానాశ్రయాల నిర్మాణంలో విద్యుత్, రహదారులు, తాగునీరు, నీటిపారుదల, బీఎస్ఎన్ఎల్ శాఖల మధ్య సమన్వయంతో సమగ్ర ప్రణాళిక రూపొందించి, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించాను.

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విమానాశ్రయాలకు విశాలమైన రహదారులు, మెరుగైన కనెక్టివిటీ, నీటి ప్రవాహాల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించాను.

Photos from Anumula Revanth Reddy's post 22/09/2026

హైదరాబాద్ తరహాలో అన్ని రంగాల్లో వరంగల్ అభివృద్ధి..!

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, టెంపుల్ మరియు ఫారెస్ట్ టూరిజం, వరంగల్ ఎయిర్‌పోర్ట్ రోడ్ కనెక్టివిటీ, బస్ టెర్మినల్, ఔటర్ రింగ్ రోడ్డు వంటి కీలక అంశాలపై నిన్న రాత్రి అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది.

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను శరవేగంగా పూర్తి చేయాలని, అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని ఆదేశించడం జరిగింది.

ఆసుపత్రి నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు, వీలైనంత త్వరగా ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది.

21/09/2026

తెలంగాణ నిత్య స్ఫూర్తి..
స్వాతంత్ర్య సమరయోధుడు..
మహనీయులు…
శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు..

Photos from Anumula Revanth Reddy's post 19/09/2026

హైదరాబాద్‌లో విద్యార్థులకు అందించే యూనిఫాం, నోట్‌బుక్స్, ఇతర సామగ్రి పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించాను.

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫాం, ఇతర సామగ్రి అందేలా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాను.

యూనిఫాంలు మరింత ఆకర్షణీయమైన రంగులు, వైవిధ్యమైన డిజైన్లతో ఉండేలా చూడాలని సూచించాను. అదనంగా 10 శాతం విద్యార్థులు చేరే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశాను.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు అందించడమే మా లక్ష్యం.

Photos from Anumula Revanth Reddy's post 19/09/2026

World-class airport at .. the dream is taking flight..!!

The BRS was in power for 10 years and still failed to make Warangal’s long-pending airport dream a reality, while its leaders remained focused on family interests and luxury farmhouses.

Now, under Congress PrajaPalana the dream is finally becoming reality.

The Telangana Government has allocated ₹295 crore for land acquisition. The required land has now been fully acquired and handed over to the Airports Authority of India (AAI).

The dream is now taking shape on the ground.

This is not just an airport. It is a new gateway for industry, tourism, education, jobs and investment.

Looking forward to flying from Mamnoor Airport, Warangal - a new symbol of a growing and connected Telangana.

What should we name Warangal’s new airport..?
Give your suggestions..!!

Photos from Anumula Revanth Reddy's post 18/09/2026

The world is looking towards Hyderabad..!!
Not just for investments & business, but for knowledge, skills, talent, innovation and the ideas that will shape the future of the world.

Yesterday at MCRHRD, I met with a delegation of leading UK business schools and universities to deepen partnerships in executive education, research, global skills and industry-academia collaboration.

From December, Harvard Executive Education programmes will be offered in , with collaborations also underway with MIT, Purdue, University of London, Virginia Tech and Northeastern University.

will take this vision further - bringing together a world-class Education Hub, Young India Skills University, global companies, cutting-edge research and the talent for the future.

Our goal is clear: make Telangana a place where the world comes to learn, innovate and invest.
$1 Trillion by 2034 | $3 Trillion by 2047. That’s our target..!!

#
Education cmrevanthreddy revanthanna

Photos from Anumula Revanth Reddy's post 17/09/2026

రజాకార్ల నిరంకుశత్వానికి ఎదురొడ్డి పోరాడారు..

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల గొంతుకగా నిలిచారు..

జీవితాంతం ప్రజల కోసమే పరితపించిన మాజీ శాసనసభ్యులు, ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, దివంగత ఉప్పల మల్సూర్ గారి కుటుంబం నేడు నిలువనీడ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలుసుకొని నా మనసు చలించిపోయింది.

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం ప్రభుత్వ, దళితుల భూములను ఆక్రమించుకొని, ప్రజల సొమ్మును దోచుకుని ఫాంహౌస్‌లు నిర్మించుకుంది తప్ప పేదలకు ఇండ్లు నిర్మించలేదని చెప్పడానికి ఉప్పల మల్సూర్ కుటుంబం యొక్క ధీనగాథే నిదర్శనం.

ఈ రోజు పత్రికల్లో వచ్చిన కథనాన్ని చూసిన వెంటనే అధికారులను ఆదేశించి, ఉప్పల మల్సూర్ గారి కోడళ్లు ఉప్పల పుష్పలత, ఉప్పల యశోద గార్ల పేర్లపై రెండు ఇందిరమ్మ ఇళ్లను తక్షణమే మంజూరు చేయడం జరిగింది. ఇండ్ల మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ ప్రతులను జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ గారు స్వయంగా ఉప్పల మల్సూర్ కుటుంబ సభ్యులకు అందజేశారు.

ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం.

Category

Telephone

Address


Jubilee Hills
Hyderabad
500033